Breaking News

టీజీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Published on Thu, 12/25/2025 - 20:54

సాక్షి, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 198 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను, 114 మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TGPRB) తీసుకుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల (డిసెంబరు) 30వ తేదీ నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించే ముందు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in లో అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు సూచించారు. 
 

జీతభత్యాల విషయానికి వస్తే, ఎంపికైన ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలకు నెలకు రూ. 27,080 నుంచి రూ. 81,400 వరకు పే స్కేల్ వర్తిస్తుంది. దరఖాస్తు రుసుముగా ఎస్‌సీ, ఎస్టీ, తెలంగాణ స్థానిక అభ్యర్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన కేటగిరీల అభ్యర్థులందరికీ రూ. 800 ఫీజుగా నిర్ణయించారు. అర్హత గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)