Breaking News

నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది: కొండా సురేఖ

Published on Thu, 12/11/2025 - 18:12

సాక్షి, హైదరాబాద్‌: తనకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందన్న కథనాలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సీరియస్‌ అయ్యారు. తనకు ఎలాంటి వారెంట్‌ జారీ కాలేదని.. కోర్టుకు హాజరు కావాలని మాత్రమే కబురు అందిందని స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారామె. 

ఇదిలా ఉంటే.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి కొండా సురేఖకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందని తొలుత ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో ఈ పరిణామం చోటు చేసుకుందన్నది ఆ ప్రచార సారాంశం. 

‘‘గురువారం (డిసెంబర్ 11, 2025) ఈ కేసు విచారణకు రాగా, నిందితురాలి గైర్హాజరును న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు’’ అని ఆ ప్రచారంలో ఉంది. అయితే దానిని కొండా సురేఖ కాసేపటికి ఖండించారు. 

‘‘కోర్టు నాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కోర్టుకు రావాలని చెప్పింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది’’ అని అన్నారామె.  
కేసు వివరాల్లోకి వెళితే.. తనపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాయని కేటీఆర్ పరువు నష్టం దాదా వేశారు. ఈ కేసు ప్రస్తుతం (C.C. No. 307 of 2025) విచారణ దశకు చేరుకుంది. గురువారం రోజున విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన కొండా సురేఖ కోర్టుకు రాలేదు. ఆమె గైర్హాజరుకు సంబంధించి న్యాయస్థానానికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)