Breaking News

‘టీడీపీలోకి వెళ్లే ఆలోచనే లేదు’

Published on Sat, 04/29/2023 - 12:20

హైదరాబాద్‌:  గోషామహల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజాసింగ్‌ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం తెర మీదకు వచ్చింది. బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన సైకిల్‌ ఎక్కుతారంటూ ఆ ప్రచారంలో ఉంది. అయితే.. ఈ ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.  తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు.

టీడీపీలో చేరతానన్న వార్తలు అవాస్తవం. బీజేపీలోనే కొనసాగుతాను. వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌ స్థానం నుంచి పోటీ చేస్తా. నా మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్‌ కాదు అంటూ జంపింగ్‌ వార్తలకు పుల్‌స్టాప్‌ పెట్టారాయన. ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. టీడీపీలోకి రాజాసింగ్‌ అంటూ ఆంధ్రజ్యోతి తాజాగా ఓ కథనం ప్రచురించింది. సస్పెన్షన్‌ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ సుదీర్ఘంగా ఆ కథనంలో చర్చించింది. కానీ, ఆంధ్రజ్యోతిది తప్పుడు ప్రచారమేనని రాజాసింగ్‌ తేల్చేశారు.

ఇదీ చదవండి: వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే.. మన ఉద్యోగాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)