Breaking News

బీజేపీ ఎంపీ ఈటలకు హైకోర్టులో చుక్కెదురు

Published on Thu, 05/01/2025 - 19:30

హైదరాబాద్‌, సాక్షి: బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై దాఖలైన కేసును కొట్టేయాలని ఆయన చేసిన అభ్యర్థన పిటిషన్‌ను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. 

ఘట్‌కేసర్‌లోని కొర్రెములలో శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్ సెక్యూరిటీ గార్డుపై ఈటల రాజేందర్‌ చేయి చేసుకున్నారని అభియోగం ఉంది. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఈటలపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే కేసులో ప్రాథమిక ఆధారాలున్నందునే పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ దశలో కేసును కొట్టేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. ఈటలపై నమోదైన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. కేసు గురించి కింది కోర్టులోనే తేల్చుకోవాలని ఈటలకు సూచిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)