Breaking News

బైక్‌తో రైలుకు ఎదురెళ్తుండగా..

Published on Fri, 12/06/2024 - 13:56

నిజామాబాద్‌: కుటుంబ కలహాలు అతన్ని తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేశాయి. బైకుతో సహా పట్టాలపై రైలుకు ఎదురెళ్లాడు. కాస్తుంటే అతనిప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.  కానీ, అతని టైం బాగుంది. రైలు ఆగింది. ప్రాణాలతో బయటపడ్డాడు. నవీపేట మండల కేంద్రంలో రైలును ఢీకొనేందుకు ఒక యువకుడు బైక్‌పై ఎదురెళ్లిన సంఘటన కలకలం రేపింది. 

భీమ్‌గల్‌ మండల కేంద్రానికి చెందిన జగదీశ్‌ (34)కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. దుబాయ్‌ లో డ్రైవర్‌గా పనిచేసే జగదీశ్‌ అప్పుడప్పు డు స్వగ్రామానికి వచ్చి వెళ్లేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నెల కిందట మకాంను నవీపేటకు మార్చాడు. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కలహాలు పెరిగాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన జగదీశ్‌ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. 

సాయినగర్‌ షిరిడీ–తిరుపతికి వెళ్లే వీక్లీ రైలును ఢీకొనాలని నిర్ణయించుకుని.. మండల కేంద్రంలోని రైలు పట్టాలపై బైక్‌పై ఎదురుగా వెళ్లాడు. ఇది గమనించిన గేట్‌మన్‌ కొద్ది దూరంలో ఉన్న మరో గేట్‌మన్‌కు సమాచారమివ్వగా గేట్‌ వేయలేదు. ఇది గమనించిన రైల్వే కో పైలట్‌ చాకచక్యంగా రైలును ఆపేశాడు. దీంతో జగదీశ్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. జగదీశ్‌పై ఆర్పీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)