Breaking News

సాయం కోరితే.. సరసాలాడమంటూ సీఐ బలవంతం!

Published on Thu, 12/05/2024 - 13:25

ఖలీల్‌వాడి: సాయం కోసం వచ్చిన యువతితో ఓ సీఐ చనువు పెంచుకుని వాట్సాప్‌ చాటింగ్‌ చేయడంతోపాటు అడ్డువచ్చిన యువకుడిపై కేసు నమో దు చేయించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువతి లెక్చరర్‌కు రూ.లక్షన్నర వరకు డబ్బులు ఇచ్చింది. లెక్చరర్‌ తన డబ్బులను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతో ఓ యువకుడి ద్వారా యువతి సీఐని కలిసి తన సమస్యను తెలిపింది. సీఐ సదరు లెక్చరర్‌ను పలుమార్లు పిలిపించి యువతి ముందే బెదిరించడంతోపాటు కొంత డబ్బును తిరిగి ఇప్పించాడు. 

ఈ క్రమంలో యువతితో చనువు పెంచుకున్న సీఐ ఆమె మొబైల్‌ నంబర్‌ తీసుకుని వాట్సాప్‌ చాటింగ్‌ మొదలుపెట్టాడు. అది ఎంత వరకు వెళ్లిందంటే.. తాను ఉదయం లేచింది మొదలు ఇంట్లో, కార్యాలయంలో ఏం చేస్తున్నది, డ్యూటీలో ఏం చేస్తున్నది ఇలా అన్ని విషయాలు, ఫొటోలు యువతితో షేర్‌ చేసుకున్నాడు. కూతురు వయస్సున్న యువతితో సీఐ వాట్సాప్‌ చాటింగ్‌ చేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. డిగ్రీ పూర్తి చేసిన యువతి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, సీఐ దగ్గరుండి ఎంక్వైరీ పూర్తి చేయించినట్లు ప్రచారంలో ఉంది. 

ఈ వ్యవహారం తెలిసిన యువకుడు ఎస్బీ కానిస్టేబుల్‌ సాయంతో అప్పటి సీపీ కల్మేశ్వర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో సీఐని అప్పటి సీపీ హెచ్చరించారు. సీపీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన యువకుడి వద్ద నుంచి ఎస్బీ కానిస్టేబుల్‌ ఫోన్‌ తీసుకుని వాట్సాప్‌ చాటింగ్, వీడియోలను డిలీట్‌ చేశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని సూచించాడు. అయితే తనపై సీపీకి ఫిర్యాదు చేసిన యువకుడిపై కక్ష పెంచుకున్న సీఐ ఓ కేసులో అతడిని ఇరికించాడు. ఆ త రువాత బదిలీపై వెళ్లిపోయిన సదరు సీఐ ఇటీ వల తిరిగి జిల్లాకు వచ్చాడు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని యువకుడు సీఐతోపాటు ఎస్సై, ఓ కానిస్టేబుల్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాడు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)