హైదరాబాద్‌: చందానగర్‌లో తీవ్ర విషాదం

Published on Wed, 12/17/2025 - 12:08

హైదరాబాద్‌: నగరంలోని చందానగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారి తన స్కూల్‌ ఐడీ కార్డుతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్కూల్‌లో తోటి పిల్లలు ఏడిపించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ప్రశాంత్‌(9) స్థానికంగా ఓ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే స్కూల్‌ యూనిఫామ్‌ సరిగా లేదని తోటి పిల్లలు ఆటపట్టించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌ ఇంటికి వచ్చాడు. ఆపై బాత్‌రూమ్‌లోకి వెళ్లి తన ఐడీ కార్డుతో ఉరి వేసుకున్నాడు.

ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. చిన్నారి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీసులు.. ఆపై స్వగ్రామానికి తరలించారు. పిల్లాడి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విద్యాసంస్థల్లో బుల్లీయింగ్‌ గురించి చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

బుల్లీయింగ్‌కి(వేధింపులు) చట్టపరమైన శిక్షలు ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు, ఆన్‌లైన్‌ వేదికల్లో జరిగే వేధింపులకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు.. సంబంధిత విద్యార్థిని సస్పెండ్‌ చేయడం, ట్రాన్స్‌ఫర్‌ చేయడం లేదంటే కౌన్సెలింగ్‌కి పంపడం జరుగుతుంది. నేరం తీవ్రతను(వయసు రిత్యా) బట్టి శిక్షలు విధించే అవకాశం లేకపోలేదు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)