Breaking News

‘రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే’

Published on Fri, 12/05/2025 - 19:02

సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం ఆయనను ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలలో  ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడారు. 

అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమాయాలు వస్తాయని, వాటిని తట్టుకోవాలని తెలిపారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటి వరకూ ప్రజలు అధైర్యపడొద్దని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

ఇక 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీఎం పదవిని కోల్పోయారు. అనంతరం ఆయన పెద్దగా పబ్లిక్‌గా కనిపించలేదు. 2023 డిసెంబర్ 4న గజ్వెల్‌లో తన ఫార్మ్‌హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఆపై 2025 జూన్ 11న, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జరుగుతున్న జ్యుడీషియల్ కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఇలా చాలా అరుదుగానే కేసీఆర్‌ బయటకొస్తున్నారు. తాజాగా  తెలంగాణలో పలు గ్రామ పంచాయతీలలో బీఆర్‌ఎస్‌ నుంచి ఏకగ్రీవంగా  ఎన్నికైన  సర్పంచ్‌లతో కేసీఆర్‌ సమావేశం అవ్వడమే కాకుండా వారిలో జోష్‌ నింపే యత్నం చేశారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)