Breaking News

గురుకులంలోకి ప్రవేశం ఇక కఠినం

Published on Sun, 11/30/2025 - 06:06

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశం, తరచూ తల్లిదండ్రుల సందర్శనలు..విద్యార్థుల బోధన, అభ్యసన కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తోంది. తల్లిదండ్రులు అసందర్భంగా, అకస్మాత్తుగా రావడం, తమ పిల్లలను ఇంటికి పంపించాలని పట్టుబడుతుండటం గురుకులాల సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ జోక్యం కూడా చోటు చేసుకుంటోంది. ఒకట్రెండు చోట్ల ఘర్షణలు సైతం జరిగిన దాఖలాలున్నాయి. ఇలాంటి పరిస్థితులతో పాటు విద్యార్థుల సంరక్షణ, భద్రతపై కూడా ఎస్సీ గురుకుల సొసైటీ దృష్టి సారించింది. 

ఇకపై నిబంధనలకు అనుగుణంగానే.. 
ఇకపై ఈ నిబంధనలకు అనుగుణంగానే గురుకుల క్యాంపస్‌లోకి తల్లిదండ్రులను అనుమతించాలని, విద్యార్థిని ఇంటికి అనుమతించేందుకు నిర్దిష్ట విధానం ఉండాలని ఎస్సీ గురుకుల సొసైటీ స్పష్టం చేసింది. ఇందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు, గార్డియన్లకు సరైన ఆధారాలతో ఫొటో గుర్తింపు కార్డును జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 268 గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 

లిఖితపూర్వక అనుమతి ఉండాలి
⇒ ప్రిన్సిపాల్‌ నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి ఉన్న వ్యక్తిని మాత్రమే గురుకుల ప్రాంగణంలోకి అనుమతించాలి. ప్రతి గురుకుల విద్యాసంస్థ సంస్థ వద్ద ఈ ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులకు ప్రవేశం లేదు..’అనే బోర్డు ఏర్పాటు చేయాలి. 

⇒ గురుకుల ప్రాంగణం గేటు దగ్గర విద్యార్థి, అతనితో వచ్చిన తల్లి, తండ్రి/గార్డియన్‌ సంతకాలు నమోదు చేసే రిజిస్టర్‌ తప్పనిసరిగా నిర్వహించాలి. గుర్తింపు పరిశీలించిన తర్వాత మాత్రమే లోనికి అనుమతించాలి. 
⇒ విద్యార్థిని కలవడానికి వచ్చిన తల్లిదండ్రులు క్యాంపస్‌లో ఉండటానికి అనుమతి లేదు. సంస్థకు సమరి్పంచిన గుర్తింపు కార్డు చూపిన తల్లిదండ్రులు మాత్రమే కలిసేందుకు అనుమతించాలి. అయితే అది కూడా తరచుగా కాకూడదు. 
అలాంటి విద్యార్థులపై నిఘా పెట్టాలి 

⇒ గురుకుల పాఠశాల/కళాశాలకు అత్యంత సమీపంలో నివాసం ఉన్న విద్యార్థులను గుర్తించాలి. తరచూ కుటుంబ సభ్యులు వచ్చి కలిసే విద్యార్థులపై ప్రిన్సిపాల్‌/హౌస్‌ మాస్టర్‌/మి్రస్టెస్‌ ప్రత్యేకంగా నిఘా పెట్టాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విద్యార్థిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలి. 
⇒ పాఠశాల పని వేళల్లో లేదా వారాంతం/ఇతర సెలవు దినాల్లో ప్రిన్సిపాల్‌ అనుమతి లేకుండా విద్యార్థిని బయటకు పంపితే, సంబంధిత హౌస్‌ మాస్టర్‌/మి్రస్టెస్‌ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

⇒ సెలవుల తర్వాత పునఃప్రారంభం రోజు లేదా ప్రిన్సిపాల్‌ పేర్కొన్న ఇతర సందర్భాల్లో తప్పనిసరిగా విద్యార్థిని తల్లి/తండ్రి/గార్డియన్‌ వ్యక్తిగతంగా తీసుకురావాలి. బాలిక తల్లిదండ్రులు లేకుండా వస్తే క్యాంపస్‌లోకి అనుమతి ఇవ్వకూడదు. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలను వాచ్‌మెన్‌/క్లాస్‌ టీచర్లు/హౌస్‌ మాస్టర్లు/   మిస్ట్రెస్‌లకు ప్రిన్సిపాల్‌ ఇవ్వాలి. 
⇒ పాఠశాల/కాలేజీ పని దినాల్లో లేదా ఆదివారాలు/ప్రభుత్వ సెలవులలో విద్యార్థిని ఇంటికి పంపించరాదు. అయితే అత్యంత సమీప బంధువు మరణం లేదా ఇంటిలో ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తల్లిదండ్రుల అభ్యర్థనపై అనుమతించవచ్చు.

సెలవులపై ముందుగానే సమాచారం ఇవ్వాలి 
⇒ విద్యార్థిని ఎవరి చేత ఇంటికి పంపించారో, వారి పేరు నమోదు.. గుర్తింపు కార్డు సమరి్పంచిన తల్లి/తండ్రి/గార్డియన్‌ సంతకంతో హౌస్‌ మాస్టర్‌/మి్రస్టెస్‌ రిజిస్టర్‌ నిర్వహించాలి. 
⇒ సెలవులు ప్రారంభం అయ్యే సమయంలో ముందుగానే అందరికీ సమాచారం ఇచ్చి, తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లలను తీసుకెళ్లాలని తెలియజేయాలి. వారు రాలేని పరిస్థితిలో, విద్యార్థి అన్న/అక్క/గార్డియన్‌తో పంపవచ్చు. అయితే ఆ వ్యక్తి ఫొటో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రిన్సిపాల్‌ వద్ద సమర్పించి ఉండాలి. 
⇒ ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజుల్లో ఇద్దరు బోధనా సిబ్బంది రొటేషన్‌ పద్ధతిలో విధులు నిర్వ హించాలి. ప్రాంగణం గేటు వద్ద భద్రతా వ్యవస్థను సదరు ప్రిన్సిపాల్‌ మరింత బలోపేతం చేయాలి.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌