ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కొత్త వేరియంట్ ప్రభావం భారత్‌పై తక్కువే
Published on Mon, 12/26/2022 - 04:02
సాక్షి, హైదరాబాద్: చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్‌లో అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు. భారతీయులకు ఇప్పటికే మూక రోగనిరోధకత వచ్చి ఉండటం ఇందుకు కారణం అని అయన ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ వైరస్ రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు కొనసాగించడం అవసరమన్నారు.
గతంలో ఒమిక్రాన్ బారినపడిన వారిలో కొందరికి బీఎఫ్–7 సోకే అవకాశం ఉంటుందన్నారు. డెల్టా వైరస్‌ను ఎదుర్కొన్నాక దేశంలో వాక్సినేషన్ జరిగిందని, ఆ తరువాత ఒమిక్రాన్ వచ్చినప్పుడు బూస్టర్ డోసులు వేసుకున్న కారణంగా భారతీయులు మెరుగైన రోగ నిరోధక శక్తితో ఉన్నారని అయన వివరించారు. అందుకే చైనా లాంటి పరిస్థితులకు ఇక్కడ అవకాశం ఉండదన్నారు.
#
Tags : 1