Breaking News

రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాం

Published on Sun, 01/26/2025 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని హైకోర్టు కొత్త జడ్జీలు రేణుక యార, నర్సింగ్‌రావు నందికొండ, తిరుమలాదేవి ఈద, మధుసూదన్‌రావు బొబ్బిలి రామయ్య ప్రమాణం చేశారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్‌ కోర్టు హాల్‌లో శనివారం ఉదయం 10.45 గంటలకు నలుగురితో న్యాయమూర్తులుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్‌ జనరల్‌ ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి.నరసింహశర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ గాడి ప్రవీణ్‌కుమార్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, రిజి్రస్టార్లు, ఏఏజీలు, కోర్టు సిబ్బందితోపాటు కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ఈ నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 11న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారే కావడం గమనార్హం. న్యాయాధికారుల కోటాలో వీరిని ఎంపిక చేశారు. 

సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కాగా, జస్టిస్‌ తిరుమలాదేవి 2026, జూన్‌ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనుండగా, మిగతా ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)