Breaking News

భార్య బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాతో నిఘా పెట్టిన సాఫ్ట్‌వేర్‌ భర్త

Published on Wed, 11/12/2025 - 13:45

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పెళ్లయి ఆరు నెలలు నిండకముందే వరకట్న వేధింపులకు ఓ అబల బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వర్లు కుమార్తె అంజలి (19)ని అదే గ్రామానికి చెందిన చిట్టూరి ఉపేందర్‌–ఉమ దంపతుల కుమారుడు సాయికుమార్‌కు ఇచ్చి ఈ ఏడాది మే 14న వివాహం జరిపించారు. రెండెకరాల పొలం, ఐదు తులాల బంగారం, రూ.10 లక్షల నగదు వరకట్నంగా అందజేశారు. హైదరాబాద్‌లో ఇంటీరియల్‌ డెకరేషన్‌ పని చేస్తున్న సాయికుమార్‌ భార్యను స్వగ్రామంలోనే ఉంచి తరచూ  వచ్చి వెళ్లేవాడు. 

ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. ఈ క్రమంలో మరికొంత కట్నం తేవాలని భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు నిరంజని, ఆమె భర్త మోహన్‌ప్రసాద్‌ వేధించసాగారు. దీంతో వెంకటేశ్వర్లు కుల పెద్దల వద్ద మాట్లాడగా.. ఇకపై మంచిగా చూసుకుంటానని సాయికుమార్‌ చెప్పినా ఆ రోజు నుంచి అంజలికి వేధింపులు మరింత పెరిగాయి. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఆమెను గృహ నిర్బంధం చేశారు. గ్రామంలో ఎవరితో మాట్లాడకుండా కట్టుదిట్టం చేయగా అంజలి మానసిక క్షోభకు గురైంది. 

సాయికుమార్‌ ఆదివారం మరోసారి ఘర్షణ పడడంతో మనస్తాపానికి గురైన అంజలి ఇంట్లోనే పురుగులమందు తాగింది. వెంటనే సాయికుమార్‌ ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాడు. కానీ సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు అంజలి మృతి చెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే సాయికుమార్, అతడి కుటుంబసభ్యులు ఇల్లెందుకు చేరుకుని పోలీసులకు సరెండర్‌ అయ్యారు. అంజలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు అత్తింటివారిపై వరకట్నం కేసు నమోదు చేసినట్లు సీఐ సురేశ్‌ తెలిపారు.

 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)