Breaking News

జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో అమానుషం

Published on Sat, 12/28/2024 - 09:37

జగిత్యాల: అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సపర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా దవాఖానాలోనే ఉన్న ఆమె హైబీపీతో తన భర్తకు ఇచ్చిన బెడ్‌పై పడిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డు పక్కన దింపడంతో భర్త కూడా బయటకు వచ్చేశాడు. 

వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురవడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే, ఆమె చేతికి గాయమైనప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి, సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోతోంది. తన భర్తకు ఆస్పత్రిలో కేటాయించిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను శుక్రవారం గమనించిన వైద్య సిబ్బంది వీల్‌చైర్‌పై బయటకు తీసుకెళ్లి, రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు.

 అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండటాన్ని గమనించిన రాజనర్సు తనకు వైద్యం వద్దని బయటకు వచ్చి, రోడ్డు పక్కన పడుకొని ఉన్న భార్య వద్దకు చేరుకున్నాడు. ఈ దంపతులను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్‌ఎంవో నవీన్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన జరగలేదని, ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు..
జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత్‌ బస్స్టేషన్‌లో దింపి పోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరి గి ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మరిచిపోయిన ఘటన వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా గా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆస్పత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

చర్యలు తీసుకున్నా మారని తీరు..
జగిత్యాల ఆస్పత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌ను సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో కఠిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా దవాఖానా సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాలంటున్నారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)