Breaking News

21 నుంచి నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌

Published on Sun, 07/13/2025 - 02:25

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లోప్రవేశం కోసం నీట్‌ యూజీ– 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆలిండియా కోటా, డీమ్డ్, సెంట్రల్‌ యూనివర్సిటీలు, రాష్ట్రం పరిధిలోని సీట్లలో చేరికకు సంబంధించిన కౌన్సెలింగ్‌ తేదీలను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆలిండియా కోటా, డీమ్డ్‌ యూనివర్సిటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలకు మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21 నుంచి 30వతేదీ వరకు జరుగు తుంది. మూడు రౌండ్లలో జరిగే ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్ 10వ తేదీ వరకు సాగనుంది.

స్టేట్‌ కౌన్సెలింగ్‌ మొ దటి దశను ఈ నెల 30 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 18 వరకు మూడు రౌండ్లలో ఈ కౌన్సెలింగ్‌ సాగనుందని ఎంసీసీ తెలిపింది. సెపె్టంబర్‌ 1వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. తెలంగాణ నుంచి నీట్‌ యూజీ –2025 పరీక్ష 70,259 మంది రాయగా, 43,400 మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లు ఇప్పటికే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

రాష్ట్రంలో 9,065 ఎంబీబీఎస్‌ సీట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలతోపాటు డీమ్డ్‌ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కలిపి 64 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 34 రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలు కాగా , 26 ప్రైవేటు కాలేజీలు. మల్లారెడ్డి డ్రీమ్డ్‌ యూనివర్సిటీ పేరిట 2 కాలేజీలు ఉండగా, ఈఎస్‌ఐ, బీబీనగర్‌ ఎయిమ్స్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. ఈ కళాశాలలన్నింటిలో కలిపి 9,065 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. వీటిలో 34 ప్రభుత్వ కళాశాలల్లో 4,090 సీట్లు ఉండగా, వాటిలో 15 శాతం అంటే 613 సీట్లు ఆలిండియా కోటా కిందికి వెళ్తాయి. మిగతా 3,477 సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి.

అలాగే 26 ప్రైవేట్‌ కళాశాలల్లో 4,350 సీట్లు ఉన్నాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన రెండు మెడికల్‌ కాలేజీలు (ఒకటి మహిళా కాలేజ్‌) డీమ్డ్‌ యూనివర్సిటీ కేటగిరీలో ఉన్నాయి. ఈ రెండు కళాశాలల్లో కలిపి 400 సీట్లు ఉండగా, డీమ్డ్‌ యూనివర్సిటీ విభాగంలో వీటికి కౌన్సెలింగ్‌ జరుగనుంది. కాగా ప్రైవేటు కాలేజీల్లోని 4,350 సీట్లలో 50 శాతం కనీ్వనర్‌ కోటా కింద తెలంగాణ విద్యార్థులకే దక్కుతాయి. మరో 35 శాతం సీట్లు బీ – కేటగిరీలో, 15 శాతం సీట్లు సీ కేటగిరీలో ఎన్‌ఆర్‌ఐ కోటాలో ఫీజు లు చెల్లించే స్తోమత ఉన్నవారికే కేటాయిస్తారు. ఇవి కాకుండా ఈఎస్‌ఐ కాలేజీలో 125 సీట్లు, బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని 100 సీట్లను ఆల్‌ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)