Breaking News

నాగార్జునసాగర్‌కు ఎన్డీఎస్‌ఏ బృందం

Published on Wed, 02/14/2024 - 04:12

నాగార్జునసాగర్‌: ‘నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్‌ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్‌ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్‌ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్‌ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు.

సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్‌వేపై ఉన్న వాక్‌వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్‌ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్‌వే దిగువన బకెట్‌ పో ర్షన్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఎన్డీఎస్‌ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ రమేశ్‌కుమార్, రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(ఎస్‌డీఎస్‌వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ వి.అజయ్‌కుమార్, డ్యామ్‌ ఎస్‌ఈ పీవీఎస్‌ నాగేశ్వర్‌రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ రెడ్డి, ఎస్‌ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ కేంద్రం పరిశీలన
ఎన్డీఎస్‌ఏ బృందం బుధవారం సాగర్‌ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్‌ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్‌లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)