Breaking News

వరంగల్‌ జనసభలో.. మోదీ నినాదం!

Published on Thu, 05/09/2024 - 11:23

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ నగరం కాషాయ జెండాలతో రెపరెపలాడింది. వరంగల్, మహబూబాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థులు అరూరి రమేశ్, సీతారాంనాయక్‌ను గెలిపించాలంటూ గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని మామునూరు తిమ్మాపూర్‌ క్రాస్‌రోడ్డు లక్ష్మీపురం మైదానంలో  బుధవారం నిర్వహించిన ఓరుగల్లు జనసభలో ప్రధాని నమో నినాదం మార్మోగింది. సభలో ఎక్కడ చూసినా నమో బొమ్మలతో కూడిన ప్లకార్డులు కనిపించాయి. భారీ ఆకృతి లో ఉన్న ఫ్లెక్సీలు సభా ప్రాంగణంలో ప్రజలు పట్టుకొని ఉండడం చూసి మోదీ ఫిదా అయ్యారు.

ఓరుగల్లు అంటే అభిమానమంటూ..
‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు.. నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్‌ అధిష్టాత్మి దేవత కూడా భద్రకాళి. ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నా. ఇక్కడినుంచి కొంచెం దూరంలో ఉన్న రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చేస్తున్నా. ఈ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక.

మూడో దశ పోలింగ్‌ను కూడా పూర్తి చేసుకొని ఇక్కడకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకునేటువంటి అదృష్టాన్ని  పొందా’ అంటూ మోదీ ప్రసంగం ప్రారంభించడంతో సభికులు పెద్దపెట్టున మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ‘నా దృష్టిలో వరంగల్‌ చాలా ముఖ్యమైనటువంటి చోటు. 40 సంవత్సరాల క్రితం బీజేపీకి ఇద్దరంటే ఇద్దరు ఎంపీలు ఉన్నప్పు డు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి దివంగత నేత జంగారెడ్డి. బీజేపీ మీ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు.

మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్‌ ప్రజానీకం వెన్నంటి నిలిచారు. అందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఇనుపగుప్పిటనుంచి వరంగల్‌ను బయటకు తీసేందుకు బీజేపీ సర్వప్రయత్నాలను చేయబోతోంది’ అని వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. వరంగల్‌లో మేం టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేశాం. కానీ, పార్కు నిర్వహణ విషయంలో సమస్యలు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరిని కోరుతున్నాను. వరంగల్‌ నుంచి అరూరి రమేశ్, మహబూబాబాద్‌ నుంచి సీతారాంనాయక్‌ను లోక్‌సభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి అంటూ సభికులను ఆయన అభ్యర్థించారు. ఇంకోవైపు కళాకా రులు నిర్వహించిన కళానృత్యాలు అందరినీ అలరించా యి. మోదీ పాటలకు సభకు హాజరైన కొందరు స్టెప్పులేయడం కనిపించింది.

వేదికపై అగ్రనేతలు.. అభ్యర్థులు..
వేదికపై మోదీకి ఒకవైపు మహబూబాబాద్, వరంగల్‌ ఎంపీ అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్‌ ప్రజలకు నమస్కరిస్తూ కనిపించారు. మురళీ ధర్‌గౌడ్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ జరగగా. మోదీ ప్రసంగాన్ని హైదరాబాద్‌కు చెంది న రాక సుధాకర్‌ అనువదించారు.

ప్రధాన వేదికపై నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, పార్టీ వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల అధ్యక్షులు గంట రవికుమార్, రావు పద్మ, నిశిధర్‌రెడ్డి, దశమంతరెడ్డితో పాటు నాయకులు కుమారస్వామి, మార్తినేని ధర్మారావు, గరికపాటి మోహన్‌రావు, కొండేటి శ్రీధర్, డాక్టర్‌ రాజేశ్వర్‌రావు, స్వాతిరెడ్డి, రావుల కోమల, జలగం అనిత, డాక్టర్‌ కాళీప్రసాద్, డాక్టర్‌ విజయరామారావు, అల్లం నాగరాజు, జలగం రంజిత్‌రావు, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మల్లాడి తిరుపతిరెడ్డి కూర్చున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)