నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు..

Published on Thu, 03/27/2025 - 10:18

శాలిగౌరారం: నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు.. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన ఉన్న నన్ను కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి నా ముందున్న ప్రశ్నాపత్రాన్ని సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. నన్ను అన్యాయంగా డిబార్‌ చేశారు. నా డిబార్‌ను రద్దు చేసి పరీక్షలకు అనుమతించాలి అని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. 

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నల్లగొండ జిల్లా విద్యాధికారి, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ సెక్రటరీ, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరిండెంట్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయవాది కర్ణాకర్‌రెడ్డి ద్వారా లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశామని ఝాన్సీలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ తమ పిటిషన్‌ను విచారించి ఏప్రిల్‌ 7న కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ నెల 21న ఎస్సెస్సీ పరీక్ష ప్రారంభం కాగా పరీక్షలు ప్రారంభమైన పావుగంటకే నకిరేకల్‌లోని సోషల్‌ వెల్పేర్‌ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకై నకిరేకల్‌, శాలిగౌరారం మండలాలలోని యువకుల వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే.

 ప్రశ్నాపత్రం లీకై న సంఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు బాధ్యులను గుర్తించి నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశ్నాపత్రం క్రమసంఖ్య నెంబర్‌ ఆధారంగా విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని గుర్తించిన అధికారులు.. ఆమెను పరీక్షలకు హాజరు కాకుండా డిబార్‌ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పాల్గొన్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు కొందరిని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)