Breaking News

అద్దె కారుతో భర్తను లేపేసిన భార్య..!

Published on Tue, 07/15/2025 - 10:39

మోటకొండూర్‌: మోటకొండూర్‌ మండలం కాటేపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మృతుడిని అతడి భార్య, బావమర్ది కలిసి హత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎస్‌ఐ నాగుల ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 

ఆత్మకూర్‌(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36), తన స్నేహితుడు మద్దికుంట వీరబాబు ఆదివారం అర్ధరాత్రి భువనగిరి మండలం రాయిగిరి నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా.. మోటకొండూర్‌ మండలం కాటేపల్లి గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుండి వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ను కారు కొద్దిదూరం లాకెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ వెనుక కూర్చున్న వీరబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. స్వామి మృతదేహాన్ని, గాయపడిన వీరబాబును స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరబాబును మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కాగా సోమావరం ఉదయం మృతుడు స్వామి బాబాయి ఐలయ్య ఈ ప్రమాదంపై పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోటకొండూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇది రోడ్డు ప్రమాదం కాదని.. వివాహేతర సంబంధం కారణంగానే స్వామిని అతడి భార్య స్వాతి, స్వాతి సోదరుడు మహేష్‌ కలిసి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడు స్వామికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)