Breaking News

సాగర్‌కు పోటెత్తిన కృష్ణమ్మ

Published on Thu, 08/01/2024 - 04:03

సాక్షి, హైదరాబాద్‌/దోమలపెంట: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 2,18,622 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో నీటినిల్వ 526.8 అడుగుల వద్ద 161.97 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌ నిండాలంటే ఇంకా 151 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో మరో ఐదారు రోజుల్లో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,62,411 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. ఎనిమిది గేట్లు పది అడుగుల మేర ఎత్తి.. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 2,83,360 క్యూసెక్కుల నీటి ని దిగువకు వదిలేస్తున్నారు.

ఆ జలాలు నాగార్జునసాగర్‌ వైపు పరుగులు తీస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్‌ డ్యామ్‌లోకి 3.35 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 3.22 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టులోకి 2.95 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 2.81 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగ, భద్ర, ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం.. భద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి తుంగభద్రలో ప్రవాహం రెండు లక్షల క్యూసెక్కులకు చేరుతుందని డ్యామ్‌ అధికారులను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. ఆ మేరకు దిగువకు వరదను విడుదల చేస్తామని తుంగభద్ర బోర్డు అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్రల్లో వరద పెరిగిన నేపథ్యంలో గురువారం నుంచి శ్రీశైలానికి చేరే వరద మరింత పెరగనుంది. 

మిడ్‌మానేరుకు జలకళ 
బోయినపల్లి(చొప్పదండి):  నిన్నటిదాకా వెలవెలబోయిన మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ప్రస్తుతం జలకళ సంతరించుకుంది. సీజన్‌ ప్రారంభమై రెండు నెలలైనా శించిన మేర వర్షాలు కురవకపోవడంతో మిడ్‌మానేరుకు పెద్దగా వరద చేరలేదు. దీంతో పంటల సాగుపై రైతులు ఆందోళన చెందారు. ఈక్రమంలో కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీగా చేరడంతో  జూలై 27న గాయత్రి పంప్‌హౌస్‌ నుంచి వరదకాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటి విడుదల ప్రారంభించారు.

మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఐదు రోజుల క్రితం 5.90 టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. రోజుకు15 వేల క్యూసెక్కుల చొప్పున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులో 10.55 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది. ప్రాజెక్టులోకి నీరు చేరడంతో సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల పరిధిలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి మండలాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)