Breaking News

ఈతరాక.. ఊపిరాడక..

Published on Sun, 12/29/2024 - 08:55

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్‌, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. వారి మరణానికి గల కారణాలతో పాటు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు నీటిలో ముగ్గురు పడిపోవడంతో జాలర్ల సాయంతో గాలించి వారి మృతదేహాలను బయటకు తీసిన విషయం తెలిసిందే. 

కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలించిన అధికారులు.. శ్రుతి, నిఖిల్‌లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని గుర్తించారు. తర్వాత వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయోనన్న దాని గురించి ఆరా తీస్తున్నారు. వారు చెరువు వద్దకు వెళ్లి అక్కడ చర్చించుకున్న సమయంలో, చెరువులో దూకినపుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన చెరువు కావడంతో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. ఆ రోజు చేపల వేటకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో ఈ ఘటన ఎవరి కంటా పడలేదని భావిస్తున్నారు.

ఎస్సై ఐ ఫోన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో ఏముందో..

వివిధ కోణాల్లో దర్యాప్తు
ముగ్గురి మరణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాల్‌డేటాను పరిశీలించిన అధికారులు వాట్సాప్‌ చాటింగ్‌లపై దృష్టి సారించారు. అయితే ఫోన్లు లాక్‌ అయి ఉండడంతో వాటిలో నుంచి సమాచారం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ సింధుశర్మ కేసు పరిశోధన గురించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా కేసు దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు కొలిక్కి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నీరు మింగి..
భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌, కానిస్టేబుల్‌ శ్రుతి, అలాగే నిఖిల్‌ నీట మునిగింది లోతైన ప్రదేశంలో కావడంతో అందులో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పదిమీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. ముందు ఎవరో ఒకరు దూకి ఉంటారని, వారిని కాపాడే క్రమంలో మి గతా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు దూకి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురికీ ఈత రాదని తెలుస్తోంది. లోతైన ప్రాంతంలో దూక డంతో ముగ్గురూ నీట మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడైంది.

ఆత్మహత్యలా.. హత్యలా?


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)