Breaking News

మా కొడుకు జాడ చెప్పండి

Published on Tue, 07/01/2025 - 07:29

భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌ను వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన మందల చిన్న సమ్మిరెడ్డి కుమారుడు రాజు 2013, జూన్‌ 20వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పటినుంచి అతడు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి చిన్న సమ్మిరెడ్డి 2017, జూన్‌ 20న భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుమారుడి గురించి ఫిర్యాదు చేశారు. 

ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు బదిలీ చేయగా, విచారణ జరిపిన పోలీసులు 2021లో రాజు ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. కొడుకు ఆచూకీ కోసం తాము వెతికామని, కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని రాజు తండ్రి .. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఎదుట వాపోయారు. గత ప్రభు త్వం తమ కుమారుడిని తెలంగాణ అమరవీరుడిగా గుర్తించిందని, అయినా ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. ఉండటానికి ఇల్లు, తమ కూతురికి ఉద్యోగ అవకాశం కలి్పంచాలని సమ్మిరెడ్డి కోరారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)