Breaking News

‘మై హోమ్‌ భుజ’ లడ్డూ రూ.51 లక్షలు

Published on Fri, 09/05/2025 - 07:51

రాయదుర్గం: హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని మైహోమ్‌ భుజ గేటెడ్‌ కమ్యూనిటీ గణేశ్‌ లడ్డూ వేలం పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కొండపల్లి గణేశ్‌ రూ.51,07,777 లకు పాడుకొని రికార్డును నెలకొల్పారు. గత ఏడాది మైహోమ్‌ భుజ లడ్డూను ఆయనే రూ.29 లక్షలకు పాడారు. అది ఈ ఏడాది రూ. 51 లక్షలు దాటడం విశేషం. పోటాపోటీగా గణేష్, శ్రీకాంత్‌ ఇద్దరూ వేలంపాటలో కొనసాగుతూ అందరినీ ఉత్కంఠకు గురిచేశారు. 

భక్తి, సెంటిమెంట్‌ వల్లే వేలంలో పాల్గొన్నా.. 
‘గణేశుడిపై ఉండే భక్తి, సెంటిమెంట్‌ వల్లే వేలం పాటలో పాల్గొన్నాను’ అని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇల్లందు గణేశ్‌ తెలిపారు. ‘మొదటిసారిగా రూ.29 లక్షలకు లడ్డూను గెలుచుకోగా నాకు వ్యాపారపరంగా ఎంతో లాభించింది. అందుకే సెంటిమెంట్‌తో ఈసారి మళ్ళీ వేలంపాటలో పాల్గొన్నాను. 25 ఏళ్ళుగా లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నా. 

ఇల్లందు (Yellandu) స్టేషన్‌బస్తీలో వినాయక ఆలయాన్ని కట్టించాం. మా నాన్న, అమ్మ 20 ఏళ్ళుగా గణేశ్‌ మాల ధరిస్తున్నారు. మైహోం భుజ కమిటీ వారు పారదర్శకంగా ఈ లడ్డూ వేలం నిర్వహించడం సంతోషంగా ఉంది’అని అన్నారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా అక్క‌డే రోడ్డు ప్ర‌మాదాలు.. ఎందుకంటే?  

 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)