Breaking News

Hyderabad: పోలీసులను ప్రశ్నించినందుకు చేయి విరగ్గొట్టారు!

Published on Mon, 09/30/2024 - 13:05

ముషీరాబాద్‌: రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని ముషీరాబాద్‌ పోలీసులు అకారణంగా దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు బాధితుని చేయి విరగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం బాధితుడు ముషీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి సత్యనారాయణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లడంతో వాహనం కోసం వినోభానగర్‌లోని తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలుచోని ఉన్నానని తెలిపారు.  

స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే... 
 పార్సిగుట్ట నుంచి వినోభానగర్‌ వైపు వెళ్తున్న పోలీసులు ఇక్కడ నిలబడొద్దని సూచించారు. తన స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే అయినా వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడారని అన్నారు. పక్కనున్న బార్‌ను మూయించరు కానీ తనను దబాయిస్తారేందని ప్రశ్నించినందుకు తనపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారన్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి చేయి విరిగిందని చెప్పారన్నారు.  

ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయాలి... 
ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌రాజ్‌ బాధితుడు సత్యనారాయణ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధితుడిని ముషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ బాబుపై దాడి చేసిన ఏఎస్‌ఐ మోహన్‌రావు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని సస్పెండ్‌ చేయని పక్షంలో స్టేషన్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.   

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు