Breaking News

కందూరు కోసం వచ్చి.. కాటికి!

Published on Wed, 05/29/2024 - 10:30

మహబూబ్‌నగర్‌, జడ్చర్ల: కందూరు చేసి మొక్కు తీర్చుకోవాలని కుటుంబంతో కలిసి వచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు బాలురు సమీపంలో ఉన్న బావిలో కాళ్లు కడుక్కోడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి ఇద్దరు బాలురు మృతిచెందగా.. కొద్దిమేర ఈత వచ్చిన మరో బాలుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. బిజినేపల్లికి చెందిన మతీన్‌ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం జడ్చర్లకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కందూరు చేయాలని భావించిన మతీన్‌ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మంగళవారం బిజినేపల్లిలోని దర్గా వద్దకు వచ్చారు. అయితే దర్గాకు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో కాళ్లు కడుక్కోవడానికి మతీన్‌ కుమారుడు పూర్కన్‌(10), బంధువు అజ్మత్‌ కుమారుడు మహమ్మద్‌(12), మరో బాలుడు అక్మల్‌ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో వారు ప్రమాదశావత్తు బావిలో జారిపడ్డారు.

దర్గాకు పాతాళ్లు ఇస్తున్న కుటుంబ సభ్యులు విషయం గమనించి వారిని రక్షించే ప్రయత్నం చేయగా.. అప్పటికే పూర్కన్, మహమ్మద్‌ నీటిలో మునిగిపోయారు. అక్మల్‌కు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం స్థానికులు అక్కడికి చేరుకుని బావిలో నుంచి ఇద్దరు బాలుర మృతదేహాలను బయటికి తీశారు. విగతజీవులుగా మారిన చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు.

జడ్చర్లలో విషాదఛాయలు..
జడ్చర్లలోని విద్యానగర్‌కాలనీలో నివాసం ఉంటున్న బీఆర్‌ఎస్‌ నాయకులు మతీన్, అజ్మత్‌ల కుమారులు మహమ్మద్, పూర్కాన్‌ బావిలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మతీన్‌కు పూర్కాన్‌తోపాటు మరో ఇద్దరు పిల్లలు ఉండగా.. అజ్మత్‌కు మహమ్మద్‌తోపాటు ఒక కూతురు ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)