Breaking News

వాగు అవతల తల్లి.. ఇవతల కొడుకు

Published on Sat, 07/22/2023 - 02:00

కొందుర్గు (రంగారెడ్డి జిల్లా): వరదనీరు తల్లీకొడుకుల హృదయాలను తల్లడిల్లేలా చేసింది. బేకరీలో పనికి వెళ్లిన ఓ తల్లి వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనంకాగా దారి మధ్యలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగుకి ఇవతలే ఆగిపోయింది. కాగా, తల్లి వాగు వద్దే ఆగిపోయిందని తెలుసుకుని కంగారుపడ్డ కొడుకు అక్కడకు చేరుకుని తల్లిరాక కోసం తల్లడిల్లిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెర్కుపల్లికి చెందిన గుర్రంపల్లి చిన్నమ్మ శుక్రవారం యథావిధిగా షాద్‌నగర్‌లోని ఓ బేకరీలో పనికి వెళ్లింది. అయితే వర్షం కారణంగా మధ్యాహ్నమే తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో కొందుర్గులో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికివెళ్తుండగా శివారులోని వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె అక్కడే ఒడ్డున ఆగిపోయింది.

చిన్నమ్మ వాగు వద్ద ఉందని తెలుసుకున్న కుమారుడు రోహిత్‌ వాగు వద్దకు వచ్చి తల్లిరాకకోసం తల్లడిల్లిపోయాడు. సుమారు మూడు గంటల ఉత్కంఠ అనంతరం వాగు ఉధృతి తగ్గుముఖం పట్టడంతో చిన్నమ్మను స్థానికులు నెమ్మదిగా అవతలి ఒడ్డుకు చేర్చారు. దీంతో తల్లీకొడుకుల నిరీక్షణ ఫలించింది. 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)