Breaking News

ఆస్పత్రికి వెళ్తూ.. అనంత లోకాలకు

Published on Thu, 01/09/2025 - 07:06

పహాడీషరీఫ్‌: అనారోగ్యంతో ఉన్న కూతురుకు చికిత్స చేయించేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన తల్లీకూతుళ్లు చివరకు అదే ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం విగతజీవులుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ హృదయ విదారక ఘటన పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మరాసిపల్లికి చెందిన చిత్తారి గోపాల్‌(36), లక్ష్మమ్మ(34) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.

వీరి పెద్ద కూతురు విజయ(14)కు  రక్తకణాలు తక్కువగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఉదయం 7.30గంటలకు వారిబైక్‌పై హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి బయలుదేరారు. ఉదయం 9.45గంటల సమయంలో తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వెనుక ఉంచి వస్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా శంషాబాద్‌ టోల్‌ వైపునకు వాహనాన్ని మళ్లించాడు. 

ఈ క్రమంలో టిప్పర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో పడిపోయిన లక్ష్మమ్మ, విజయ తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో తల్లీకూతురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గోపాల్‌ కాలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నారు.  

 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?