Breaking News

ఫుడ్‌ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి

Published on Tue, 04/08/2025 - 09:31

రుద్రంగి (వేములవాడ): ఫుడ్‌ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్‌ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. 

పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 

మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు
కాగా పుష్పలత, నిహాల్‌ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్‌ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్‌ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్‌ తెలిపారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు