Breaking News

6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!

Published on Mon, 06/08/2026 - 13:15

ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్‌నగర్‌బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.

ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్‌ స్నేక్‌ క్యాచర్‌ దుర్గా రాజేష్‌ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు.  

మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.

ఏ బస్తీలో చూసినా..
మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్‌నగర్, నెంబర్‌–2 ఇంక్‌లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్‌ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్‌టెక్స్‌ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్‌ ఏరియా, కొత్తబస్టాండ్‌ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్‌ బస్తీ, షంషీర్‌నగర్, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్‌ బస్తీ, అశోక్‌నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్‌బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.

వారం రోజుల్లో..
పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్‌టెక్స్, 65 డీప్‌ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్‌ బంగ్లాబస్తీ, నెంబర్‌–2 ఇంక్‌లైన్, సుభాష్‌నగర్‌ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. 

వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్‌ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్‌ క్యాచర్లు ప్లాస్టిక్‌ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)