Breaking News

హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన!

Published on Mon, 07/17/2023 - 09:33

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే.. రాగల 24 గంటల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 

సోమవారం ఉదయం నుంచి నగరంపై ముసురు అలుముకుంది. క్రమంగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. మరికొన్ని గంటల్లో ఇది భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నగరవాసులకు సూచన చేస్తోంది జీహెచ్‌ఎంసీ. 

☁️ మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని.. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తోంది.

☁️ ఇక తెలంగాణ రాష్ట్రంపై నైరుతి రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంది. 18వ తేదీన వాయువ్య బంగాళాఖాతం లో తుఫాను సర్కులేషన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 

☁️ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉత్తర ఒడిశా గంగా పశ్చిమ బెంగాల్ తీరాలలో దాని ఆనుకొని ఉన్నఒడిశా గంగాపశ్చిమ బెంగాల్ ,జార్ఖండ్ లపై అల్ప పీడనం ప్రభావం కనిపిస్తోంది. అసోసియేటెడ్ సైక్లోనిక్ సర్కులేషన్ నైరుతి వైపు వంగి ట్రోపోస్పిరికల్ విస్తరించి ఉంది. 

☁️ రానున్న మూడు(నాలుగు) రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ అయ్యింది.  

☁️ కొమరం భీమ్ ఆసిఫాబాద్, అదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ,వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోనీ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: వందేభారత్‌కు మంటలు.. తప్పిన ప్రమాదం

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)