Breaking News

రెండ్రోజులు మోస్తరు వానలు!

Published on Thu, 05/09/2024 - 05:01

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించింది.

 బుధవారం రాష్ట్రంలో చాలాచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.24 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని ప్రణాళికా విభాగం వివరించింది. అత్యధికంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో సగటున 4.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్‌ జిల్లాలో సగటున 4.42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు జిల్లాల్లో సగటున 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాచుపల్లిలో 10.8 సెంటీమీటర్లు, ఆ తర్వాత శేరిలింగంపల్లిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్‌
మంగళవారం, బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మేర తక్కువగా నమోదయ్యాయి. 

అధికంగా నిజామాబాద్‌ జిల్లా జకొరలో 42.9 డిగ్రీల సెల్సియస్,  కొరట్‌పల్లిలో 42.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి కాస్త తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, కొన్నిచోట్ల సాధారణం కంటే అధికంగా నమోదవు తాయని వాతావరణ శాఖ సూచించింది. 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)