‘హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు’

Published on Mon, 09/09/2024 - 14:13

హైదరాబాద్‌,సాక్షి: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయ శ్రేణులు స్పందిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుండగా.. ఈ తీర్పుపై పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరో బెంచ్‌ను  ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.


హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు: మాజీ మంత్రి హరీష్ రావు

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం.
  • ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు.
  • హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యం.
  • తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉంది.
  • పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యం.

కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: కేటీఆర్‌

  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ కు హైకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చింది
  • నాలుగు వారాల తర్వాత దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు ఊడటం ఖాయం
  • పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. మొదటి నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నాం
  • పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
  • రాజ్యాంగ పరిరక్షణ అంటూనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
  • న్యాయస్థానాల్లో, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్న కేటీఆర్

హైకోర్టు తీర్పు హర్షనీయం: బీఆర్‌ఎస్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు

  • బీఆర్‌ఎస్‌ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌కి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఇది.
  • నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం హర్ష నీయం.
  • స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోకపొతే సుమోటోగా కేసు విచారిస్తామని హైకోర్టు చెప్పింది.
  • స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు ఇచ్చిన అనేక తీర్పులున్నాయి.
  • నాలుగు వారాల్లో స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపొతే కోర్టు ధిక్కార పిటిషన్‌ వేస్తాం.
  • ఈ వ్యవహారంలో అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తాం.
  • ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుంది.  

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం, కానీ: కడియం

  • రాజకీయ నేతగా హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా 
  • తీర్పును సమగ్రంగా పరిశీంచాల్సి ఉంది 
  • ఫిరాయింపులపై కామెంట్‌ చేసే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు
  • సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై డబుల్‌ బెంచ్‌ వెళ్లొచ్చు
  • అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లొచ్చు

ప్రజాకోర్టులో కూడా ద్రోహులకు దెబ్బ తప్పదు: జగదీష్‌ రెడ్డి

  • నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో మహాకవి కాళోజీ నారాయణరావు  జయంతి వేడుకులు
  • కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
  • బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు వచ్చింది: జగదీశ్ రెడ్డి
  • ప్రజాకోర్టు లోకూడా ద్రోహులకు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు: జగదీశ్ రెడ్డి
  • పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు పడటం ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయంv
  • హైడ్రా పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతిస్తున్నడు: జగదీశ్ రెడ్డి
  • హైదరాబాద్ అంటేనే భయపడేలా చేసిండు: జగదీశ్ రెడ్డి
  • అడ్డగోలుగా బుల్డోజర్లలతో రాజకీయాలు చేస్తుండు
  • రాజకీయ కక్ష సాధింపు చేస్తూ హైడ్రామా అడుతున్నాడు
  • రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి

కోర్టు నిర్ణయాన్ని స్పీకర్‌ గౌరవించాలి:  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

  • నేను ,ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్ పై హై కోర్టు తీర్పు ఇచ్చింది ..
  • పార్టీ మారి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హై కోర్టు స్పీకర్ కు సూచించింది
  • స్పీకర్ హై కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి
  • కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల పై రాష్టానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది
  • హిమాచల్ లో బీజేపీ కి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేశారు
  • కర్ణాటక లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు
  • కాంగ్రెస్ జాతీయ పార్టీ లా వ్యవహరించడం లేదు
  • ఉప ప్రాంతీయ పార్టీ లా వ్యవహరిస్తోంది
  • రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపుల పై ఎందుకు స్పందించడం లేదు
  • రేవంత్ రెడ్డి కి కారెక్టర్ లేదు
  • రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపుల పై చెప్పిన మాటలను గౌరవించాలి
  • కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు
  • ఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి
  • బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం
  • దానం నాగేందర్ ను హైదరాబాద్ రోడ్ల పై మేమే ఉరికిస్తాం
  • రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ము తో పది మంది బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు
  • అన్ని వ్యవస్థలు పరస్పరం సహరించుకుని పని చేయాలి
  • హై కోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలి

స్పీకర్‌పై సీఎం ఒత్తిడి  చేయొద్దు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద

  • హై కోర్టు తీర్పు బీ ఆర్ ఎస్ సాధించిన తొలి విజయం
  • మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి
  • స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి
  • సీఎం ఆయన పై ఏ ఒత్తిడి తేవొద్దు
  • కాంగ్రెస్ పిరాయింపుల పై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి
  • స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి
  • కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
  • హై కోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది
  • అన్ని అసెంబ్లీ లకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది
  • సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)