Breaking News

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హౌస్‌ అరెస్ట్‌

Published on Thu, 03/28/2024 - 15:53

సాక్షి,  హైద‌రాబాద్: గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవ‌ల అల్ల‌ర్లు చోటు చేసుకున్న చెంగిచెర్ల‌కు గురువారం సాయంత్రం వెళ్తాన‌ని రాజాసింగ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా పోలీసులు నిర్బంధించారు.

అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో హిందువుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఇది మంచిది కాద‌ని తెలిపారు. బాధితుల‌పై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు.

కాగా మేడ్చల్‌ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు.  ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి: ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: KTR ఆవేదన

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)