Breaking News

ఆయన మంచి రైటర్‌.. ఇక్కడ మంచి ఫైటర్‌ కావాలి: రాజాసింగ్‌

Published on Sun, 07/27/2025 - 20:34

సాక్షి,హైదరాబాద్‌: తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

‘‘రామచందర్ రావు మంచి రైటర్. కానీ  తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి. నా రాజీనామా వెనక కుట్ర లేదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నా. 

నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది.  

హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా.. మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో.. తెలియదు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను.. ఆ లోపే రాజీనామా చేశాను.

తెలంగాణలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్ట్ కేంద్ర పార్టీ తెప్పించుకోవాలి. కొంతమంది బీజేపీ మహిళానేతలకు దండం. వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశ్యం ఒక్కటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు  ఇచ్చే అలవాటు నాకు లేదు.. అటువంటి చిన్న ఆలోచన నేను చేయను"అని అన్నారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)