ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

Published on Fri, 06/06/2025 - 09:40

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచి డాక్టర్లు బులెటిన్‌ విడుదల చేస్తారని హరీశ్‌రావు చెప్పారు. అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని గోపీనాథ్‌ క్షేమంగా బయటకు వస్తారన్నారు. బోరబండకు చెందిన తన అనుచరుడు సర్దార్‌ ఆత్మహత్యతో గోపీనాథ్‌ ఒత్తిడికి లోనయ్యారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ వెల్లడించారు.

కుడి భుజంగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, కారణమైన వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అస్వస్థతకు లోనైనట్లు కుంటుంబ సభ్యులు తెలిపారన్నారు. గోపీనాథ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తిరిగి క్షేమంగా వస్తారని చెప్పారు. ఏఐజీ ఆస్పత్రి కి ఎమ్మెల్యే కృష్ణారావు, వివేకానంద, ముఠాగోపాల్, గూడెం మహిపాల్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు వెళ్లారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)