Breaking News

రీడిజైన్‌ తప్పిదంతోనే ప్రమాదం 

Published on Mon, 10/23/2023 - 04:48

కాళేశ్వరం/ మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌ లోపంతోనే ప్రమాదం ఏర్పడిందని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని అంబట్‌పల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్స్‌ పంపింగ్‌ అనేది ప్రపంచంలో ఎక్కడా సక్సెస్‌ కాలేదన్నారు.

గతేడాది బాహుబలి మోటార్లు మునిగాయని, గ్రా­విటీకాల్వ కూలిందని, ఇప్పుడు బ్యారేజీ పిల్లర్లు కుంగుతున్నాయని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ విజయభేరి యాత్రకువస్తే కాళేశ్వరా­నికి వెళ్లి అభివృద్ధి చూడాలన్నారని.. ఇప్పుడు మునిగిన మోటార్లు, కుంగిన బ్యారేజీని చూడాలా అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు ఆయన మంథనిలో విలేకరులతో మాట్లాడుతూ, నాణ్యత లేకుండా నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మ­ను నీటిపాలు చేశారని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. 

శ్వేతపత్రం విడుదల చేయాలి: ఈటల 
కాళేశ్వరం: ఇంజనీరింగ్‌ వైఫల్యంతోనే బ్యారేజీలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం ఆయన మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో వర్షాకాలంలో వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రస్తుతం 15వ పిల్లర్ల నుంచి 22వ పిల్లర్ల వరకు కుంగినట్లు తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై   ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని  సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)