Breaking News

ఉక్కపోత.. కుండపోత

Published on Fri, 09/19/2025 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఒకేరోజు మిశ్రమ వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు భానుడు ప్రతాపం చూపగా.... ఆ తర్వాత ఒకేసారి ఆకాశం మేఘావృతమై వరుణ దేవుడు విశ్వరూపం ప్రదర్శించాడు. భారీ వర్షానికి హైదరాబాద్‌ అతలాకుతలమైంది. గురువారం గంటన్నర పాటు కురిసిన కుండపోత వర్షానికి నగర జీవనం కకావికలమైంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం పడింది. అత్యధికంగా పాతబస్తీ బహదూర్‌పురాలోని జూపార్క్‌ వద్ద 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

ప్రధాన రహదారులు చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్తీల్లోని నివాసాల్లో వరద నీరు వచ్చి చేరింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ విద్యాసంస్థలు వదలడంతో విద్యార్ధులు, డ్యూటీలు ముగించుకొని ఇంటి దారి పట్టిన ఉద్యోగులు ట్రాఫిక్‌లో గంటల కొద్దీ నరక యాతన పడ్డారు. వరద ఉధృతికి రోడ్లపై అడుగు పెడితే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్ల పక్కన నిలిపిన ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకొని పోయాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీసు, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. 

నాలుగు దిక్కులా చక్ర బంధం 
భారీ వర్షానికి హైదరాబాద్‌ నలుదిక్కులా చక్రబంధంగా ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. నాంపల్లి నుంచి మాసాబ్‌ట్యాంక్, లక్డీకాపూల్‌ నుంచి ఖైరతాబాద్, సోమాజిగూడ నుంచి మియాపూర్, సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్, మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, చాంద్రాయణ గుట్ట నుంచి మలక్‌పేట, ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ తదితర మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గంటల కొద్దీ వాహనదారులు నరకయాతన పడ్డారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొన్నం  
మూడు రోజుల్లో పడాల్సిన వర్షం 30 నిమిషాల్లోనే కుంభవృష్టిగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)