Breaking News

బుద్ధవనంలో సౌందర్య ధ్యానం..

Published on Tue, 05/13/2025 - 00:29

నాగార్జునసాగర్‌: ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్‌లో సందడి చేశారు. నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సోమవారం నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్‌ వరల్డ్‌ ఓసియానా గ్రూప్‌–4లోని 22 దేశాల సుందరీమణులు హాజరయ్యారు. హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయవిహార్‌ అతిథిగృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయవిహార్‌ వెనుకభాగంలోని పార్కులో ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీపర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. 

మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6.42 గంటలకు వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్టు శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు, తెలంగాణకు బౌద్ధమతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచ ధ్యానబుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. రాత్రి 7.08 గంటలకు బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షవులు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. 

అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ.కోటిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఐఏఎస్‌ అధికారి లక్ష్మి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్, ఏఎస్పీలు రమేశ్, మౌనిక, ఆర్డీఓలు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)