Breaking News

సీరియల్స్‌, సినిమాల్లో నటించాలనే కోరిక..  ఫ్రెండ్‌ ఇంట్లో పూజ ఉందని చెప్పి..

Published on Sat, 07/15/2023 - 08:35

సాక్షి, హైదరాబాద్‌: బాలిక మిస్సింగ్‌ కేసును గంటల వ్యవధిలోనే మధురానగర్‌ పోలీసులు పరిష్కరించారు. వివరాలివీ... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే డి.సంతోషి కుమార్తె బుధవారం ఉదయం స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లింది. గురువారం వరకు కూడా తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు గురువారం రాత్రి మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ అయినందున పోలీసులు బాలికను కనిపెట్టే విషయంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఫోన్‌ ఆధారంగా యాదాద్రిలో ఉన్నట్టు గుర్తించారు.

శుక్రవారం ఉదయం ఆ బాలిక యాదాద్రిలో తనకు తెలిసిన లక్ష్మీ అనే మహిళతో కలిసి తిరుగుతుండగా ఎస్‌ఐ నరేందర్, సిబ్బంది వెళ్లి పట్టుకున్నారు. బాలికను విచారించగా సీరియల్స్, సినిమాలలో నటించాలని కోరిక ఉందని, అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్‌లో చిన్న క్యారెక్టర్స్‌లో కూడా నటించినట్టు పేర్కొంది. ఈ క్రమంలో లక్ష్మీ అనే మహిళ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పడంతో యాదాద్రికి వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు బాలికను మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)