మరో కొత్త పథకం.. రైతులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Published on Thu, 04/10/2025 - 17:01

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ శాఖలో మరో కొత్త పథకం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ‘గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ పథకాన్ని జూన్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరికి నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యమని మంత్రి అన్నారు.

సుమారు 40, 000 మంది రైతులకు, 2500 నుంచి 3000 క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి ముగ్గురు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథక కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

గత నెలలో కురిసిన వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు పంట నష్టం అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు. మార్చిలో కురిసిన వడగళ్ల వర్షాలకు 8,408 ఎకరాల్లో జరిగిన పంట నష్టం జరిగినట్టు గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. నష్ట పరిహారం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  కాగా, ఈ నెలలో కురిసిన వడగళ్ల వానకు, ఈదురు గాలులకు పంట నష్టంపై ప్రాథమిక రిపోర్ట్‌ ప్రభుత్వానికి అందిందని.. పరిశీలించి వారికి కూడా నష్ట పరిహారం అందించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)