Breaking News

నన్ను రమ్మంటారా?.. మీరొస్తారా?

Published on Fri, 07/14/2023 - 03:37

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యా వ్యవస్థ, విద్యార్థులను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అకారణంగా అవమానించారని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణలో చూసి పరీక్షలు రాస్తున్నారని చేసిన బొత్స వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం  సచివాలయం మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చకు నన్ను రమ్మంటారా?.. మీరొస్తారా..? అని సవాల్‌ విసిరారు.

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.. పోనీ హైదరాబాద్‌... ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.  మీ విద్యార్థులు మా విద్యార్థులతో పోటీ పడితే అసలు విషయం బయటపడుతుందన్నారు. ఏపీ నుంచి చదువు కోవడానికి తెలంగాణకు వస్తున్నారే తప్ప.. తెలంగాణ వాళ్లు ఏపీకి పోవడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

అందరినీ సమానంగా చూసి ఉంటే రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండేవని, మీలాంటి వ్యక్తుల వ్యాఖ్యలతోనే తెలంగాణ విడిపోయిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే రకరకాల ఇబ్బందులని, అదే మా దగ్గర యాదాద్రి, వేములవాడ, రామప్ప, భద్రకాళి ఎక్కడైనా సరే అందరినీ ఒకే రకంగా చూస్తామన్నారు. తమ పార్టీ బీఆర్‌ఎస్‌కు ఏపీ నుంచి కూడా బాగా ఆదరణ ఉందని శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. 

Videos

DSP ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అవినాష్ రెడ్డి

ఓటమి భయంతోనే.. చంద్రబాబు అండ్ కో దాడులు

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

Photos

+5

అల్లు శిరీష్- నయనిక జపాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)