Breaking News

కేటీఆర్‌ ఢిల్లీకి ఎందుకు పోతారో తెలుసు: మంత్రి శ్రీధర్‌బాబు

Published on Tue, 11/12/2024 - 16:03

సాక్షి,హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా లగిచర్లలో కలెక్టర్‌పై దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ విషయమై శ్రీధర్‌బాబు మంగళవారం(నవంబర్‌ 12) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ అశాంతిని రగులుస్తోంది.ప్రభుత్వ పరంగా  ఎక్కడ తప్పు జరిగిందో తేల్చుతాం.లా అండ్‌ ఆర్డర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.కేటీఆర్ అన్నంత మాత్రానా ఎవరికి ఎవరూ భయపడరు.రాజకీయాల కోసం దాడులకు తెగబడితే కఠిన చర్యలు తప్పవు.

కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతారో అందరికీ తెలుసు.కేసుల నుంచి తప్పించాలని ఢిల్లీని వేడుకుంటున్నారు.అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏటీఎంగా ఉందా..మోదీ ఆరోపణలన్నీ రాజకీయ లబ్ది కోసమే.బీజేపీ,బీఆర్‌ఎస్‌ కలిసే పనిచేస్తున్నాయి’అని శ్రీధర్‌బాబు ఆరోపించారు.

కాగా కలెక్టర్‌పై దాడి ఘటన మీద జిల్లా  ఇంఛార్జ్‌‌ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వికారాబాద్‌ కలెక్టర్ ప్రతీక్ జైన్,ఐజీ సత్యనారాయణ,ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు.

ఘటన వివరాలను శ్రీధర్‌బాబు అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పోలీసుల తీరుపై శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఘటనపై రిపోర్టు ఇవ్వాలని  డీజీపీ, సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది. దాడిపై పోలీస్‌ శాఖ నివేదికను సిద్ధం చేస్తోంది. 

ఇదీ చదవండి: ఫార్మాపై రైతుల ఫైర్‌.. అధికారులపై దాడి 
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)