Breaking News

మరో 24 గంటలు అప్రమత్తం

Published on Fri, 08/15/2025 - 05:09

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు మరో 24 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయని, దానిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలసి గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్‌ అలర్ట్‌ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు గుర్తుచేశారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దుచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లో లెవెల్‌ బ్రిడ్జీల దగ్గర పోలీస్‌ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న ప్రాంతాల ప్రజలకు వేరేచోట్ల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)