Breaking News

‘ప్రపంచంలో రోల్ మోడల్‌గా గ్లోబల్ సమ్మిట్’

Published on Sat, 12/06/2025 - 20:08

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే  గ్లోబల్  సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా  నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల‌ను  మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మీడియాతో  మాట్లాడారు. ఈ స‌మ్మిట్‌కు దేశ‌విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష‌గుర్తింపు పొందిన దిగ్గ‌జాలను ఆహ్వానించ‌డం జ‌రిగింద‌న్నారు.

‘లక్ష్యాలు, ఆలోచ‌న‌ల‌ను ఈ స‌మ్మిట్‌లో వివ‌రించ‌బోతున్నాం.  గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి సూచ‌న‌ల  మేర‌కు ఈ రోజు స‌మ్మిట్ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌ని, గ‌డువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్ల‌కు ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సారధ్యంలో ఇందిర‌మ్మ కాంగ్రెస్  ప్ర‌భుత్వం ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోంది .తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవ‌స్ధను ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ ఎకాన‌మీగా వృద్ది సాధించాల‌నే లక్ష్యంతో ప‌నిచేస్తున్నాం.   2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యం సాధించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంద‌న్నారు.  స‌మ్మిట్‌పై ఇండిగో విమానాల ర‌ద్దు ప్ర‌భావం ఏమాత్రం చూప‌ద‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారు దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చే అతిధుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌రిశీస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)