Breaking News

హరీశ్‌రావు.. దమ్ముంటే చర్చకు రా..

Published on Tue, 10/28/2025 - 04:19

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకొని, దాచుకొని ఇప్పుడు రాష్ట్ర కేబినెట్‌ను ‘దండుపాళ్యం బ్యాచ్‌’అంటారా అని మాజీమంత్రి హరీశ్‌రావుపై సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నిప్పులు చెరిగారు. మంత్రివర్గం, సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సోమవారం మంత్రుల సముదాయంలో ఎమ్మెల్యేలు నాగరాజు, వేముల వీరేశం, మందుల సామేల్, ఎమ్మెల్సీలు బల్మూరు వెంకట్, అద్దంకి దయాకర్, ఎంపీ అనిల్‌యాదవ్‌లతో కలిసి మీడియాతో మంత్రి అడ్లూరి మాట్లాడారు.

మీ మామ, మీరు.. నీ బామ్మర్దులు దండుపాళ్యం ముఠా నాయకులని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచు కున్న మీరే ‘స్టువర్ట్‌పురం దొంగలకు మించిన బందిపోట్లు’అని ఘాటుగా విమర్శించారు. మీ మంత్రివర్గంలో ఎంతమంది ఉన్నా, మీ ముగ్గురే నడిపించారని, అదే సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో దళితులు, బలహీనవర్గాలు ఉన్న కేబినెట్‌ను అవమానిస్తావా అని ప్రశ్నించారు. కేబినెట్‌పై మా ట్లాడిన హరీశ్‌రావును సిద్దిపేట దేవాలయంలో చర్చకు రావాలని సవాల్‌ విసిరితే రాకుండా తోక ముడిచారని మంత్రి అడ్లూరి అన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎవరినో పంపడం కాదు..నీకు దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు నువ్వేరా.. ప్రజల ముందే చర్చిద్దామని సవాల్‌ విసిరారు. 

⇒ బీఆర్‌ఎస్‌ దండుపాళ్యం బ్యాచ్‌కు నాయకుడు హరీశ్‌రావేనని మందుల సామేల్‌ అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతి పనిలో దోచుకున్నార న్నారు. నాగరాజు మాట్లాడుతూ మీరు చేసిన పనులకు లలిత్‌మోదీ, విజయ్‌ మాల్యలు కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారన్నారు. వేముల వీరేశం మాట్లాడుతూ మంత్రి అడ్లూరి సవాల్‌ ను స్వీకరించకుండా హరీశ్‌రావు పారిపోయారని చెప్పారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు మాట్లాడుతూ కేసీఆర్‌ అడ్రస్‌లేదని, వస్తారో లేదో కూడా తెలవదని ఎద్దేవా చేశారు. ఎంపీ అనిల్‌ మాట్లాడుతూ ప్రజలను మో సం చేస్తే సరైన తీర్పు ఇస్తారన్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)