Breaking News

మధ్యలోనే ఆగిపోయిన లిఫ్ట్‌.. 2 గంటలు నరకయాతన!

Published on Sat, 06/13/2026 - 07:47

ఉప్పల్‌: స్కైవాక్‌ లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోవడంతో ఓ యువకుడు దాదాపు బతుకుజీవుడా సుమారు 2 గంటల పాటు అందులో చిక్కుకుని విలవిలలాడాడు. లిఫ్ట్‌ తలుపులు తెరుచుకుంటాయా.. లేదా? అని తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు టెక్నీషియన్‌ వచ్చి చర్యలు చేపట్టడంతో ఊపిరిపీల్చుకున్నాడు. ఈ ఘటన ఉప్పల్‌ స్కైవాక్‌పై గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాహుల్‌ (22) అనే యువకుడు ఉప్పల్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

గురువారం రాత్రి విధులు ముగించుకుని హాస్టల్‌కు బయలుదేరాడు. ఉప్పల్‌ రోడ్డు దాటడానికి ౖస్కైవాక్‌ వంతెన ఎక్కి కిందకు దిగడానికి లిఫ్ట్‌–6లో వస్తున్నాడు. ఈ క్రమంలో లిఫ్ట్‌ మధ్యలో ఆగిపోవడంతో ఆందోళనకు గురైన రాహుల్‌ 100, 108 అధికారులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

లిఫ్ట్‌ల మె యింటెనెన్స్‌ చూస్తున్న హెచ్‌ఎండీఏ  సిబ్బంది స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. లిఫ్ట్‌లోని రాహుల్‌ అరుపులు, కేకలు పెట్టినా ఫలితం లేకుండాపోయింది. దాదాపు 2 గంటల తర్వాత ఎట్టకేలకు టెక్నీíÙయన్‌ రావడంతో కథ సుఖాంతం అయ్యింది. రాత్రి 11.30 నుంచి 1.15 నిమిషాల వరకు రాహుల్‌ యువకుడు బిక్కుబిక్కుమంటూ లిఫ్ట్‌లోనే గడపాల్సి వచ్చింది. తాను హార్ట్‌ పేషెంట్‌నని, లిఫ్ట్‌లో ఇరుక్కోవడంతో భయాందోళన చెందినట్లు రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

జడుసుకుంటున్న జనం 
ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఉప్పల్‌ స్కైవాక్‌ ఎక్కడానికి ప్రయాణికులు జంకుతున్నారు. అందులోనూ లిఫ్ట్‌లు ప్రమాదకరంగా మారాయంటున్నారు. మొదట్నుంచీ లిఫ్ట్‌లు మొరాయిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఉప్పల్‌ చౌరస్తాలో స్కైవాక్‌ వంతెనకు ఎనిమిది లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్‌లు 24 గంటల పాటు పని చేస్తుంటాయి. రోజూ వేలాది మంది  స్కైవాక్‌ ఎక్కి దిగుతుంటారు.

లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. లిఫ్ట్‌లోఉన్న వారు తలుపులను బలవంతంగా తెరవడం, అటూ  ఇటూ లాగడం వల్ల  సెన్సా ర్లు పని చేయవని, గురువారం రాత్రి అదే జరిగిందని హెచ్‌ఎండీఏ  అధికారులు వివరణ ఇచ్చారు. టెక్నీíÙయన్‌ వచి్చన తర్వాతే లిఫ్ట్‌ తలుపులు తెరుచుకున్నాయని స్పష్టం చేశారు.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు