Breaking News

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సక్సెస్‌.. ఒక కేస్‌స్టడీ

Published on Mon, 03/11/2024 - 06:22

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో ప్రాజె క్టుపై ప్రతిష్టాత్మక స్టాన్‌ ఫోర్డ్‌ వర్సిటీ ప్రశంసలు కురిపించింది. విశ్వవిద్యా లయానికి చెందిన మేనేజ్‌ మెంట్‌ విద్యార్థులకు, ప్రాక్టీ షనర్లకు మెట్రో ప్రాజెక్టు విజయగాథ ఒక కేస్‌ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే స్టాన్‌ఫోర్డ్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్‌) తాజా సంచికలో (స్ప్రింగ్‌–2024) ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవం అని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అభివర్ణించింది. ప్రపంచంలో చేపట్టిన పలు భారీ ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే అనేక సమస్యలు, వాటిని అధిగమించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలు, తదితర అంశాలపై తగిన సూచనలు, పరిష్కార మార్గాలను ఈ త్రైమాసిక జర్నల్‌ అందజేస్తుంది.

ఈ క్రమంలో వివిధ దేశాల్లోని పలు ప్రాజెక్టులపైన విస్తృత అధ్యయనాల్లో భాగంగా ఐఎస్‌బీ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెసర్‌ రామ్‌ నిడుమోలు, ఆయన బృందం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపైన క్షుణ్ణంగా జరిపిన అధ్యయనాన్ని స్టాన్‌ ఫోర్డ్‌ వర్సిటీ ఒక కేస్‌ స్టడీగా ఎంపిక చేసుకొని ప్రచురించింది. పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు సంస్థ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచినట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

 ఒకదశలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి దాన్ని సుసాధ్యం చేశారని జర్నల్‌లో ప్రశంసించారు. ప్రాజెక్టును విజయపథంలో నడిపించారని, ఇది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమని ఈ కేస్‌ స్టడీ తెలియజేసింది. హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ విస్తృత ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యల్లో సమర్ధవంతమైన నాయకత్వ ప్రతిభను ఎన్వీఎస్‌ కనబరిచినట్లు జర్నల్‌లో ప్రచురితమైంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య