Breaking News

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం

Published on Wed, 01/08/2025 - 12:37

సాక్షి,హైదరాబాద్‌ : సంక్రాంతి పండుగ సంబరాలను (Sankranthi celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ మెట్రో(Metro train) సన్నాహాలు ప్రారంభించింది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్‌ మై మెట్రో క్యాంపెన్‌ పేరిట కోఠి ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌లో వేడుకలను ప్రారంభించింది.  

సంక్రాంతి పండుగలో భాగంగా సంక్రాంతి మెట్రో ఫెస్ట్‌ను బుధవారం మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ  కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ (​hyderabad) మెట్రో ఇంజనీరింగ్ అద్భుతం. మెట్రోలను రైల్వే ఇంజనీర్లు ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. కానీ మేం హైదరాబాద్ మెట్రోను కేవలం ట్రాన్స్‌పోర్ట్‌ మోడ్ మాత్రమే కాకుండా హైదరాబాద్ ఆత్మ ప్రతిబింబించేలా హైదరాబాద్ మెట్రోను నిర్మించాం.

2013లో ప్రపంచంలోని టాప్ 100 ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకదానిలో మెట్రో రైల్ నిలిచింది. హైదరాబాద్ నగరంలో వున్న 90 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తే రోడ్లన్నీ జామ్ అవుతాయి. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టం మాత్రమే ఉపయోగపడుతుంది. మెట్రో లాంటి వ్యవస్థలు అందులో చాలా ముఖ్యమైనవి.

మెట్రో రైలు జర్నీనీ ప్రయాణికులు ఎంజాయ్ చేస్తున్నారు. వారి కోసం మీ  టైం ఆన్ మై  మెట్రో  క్యాంపెయిన్‌ను అందుబాటులోకి తెచ్చాం. మెట్రో స్టేషన్లలో మీ టాలెంట్ చూపించేలా మెట్రో అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మెట్రో స్టేషన్లలో మీ టాలెంటును షోకేస్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తాం. డాన్సులు సంగీతం వంటి అంశాలు మీరు ప్రదర్శించవచ్చు.

సీఎం రేవంత్ రెడ్డి విజనరీ లీడర్ మెట్రో ప్రాజెక్టు పై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ధీటుగా హైద్రాబాద్ మెట్రో విస్తరణ చేయాలన్నారు. హైదరాబద్ విశ్వ నగరాన్ని చేయడానికి మెట్రో కీలక పాత్ర పోషిస్తుంది. హబ్‌ను ఏర్పాటు చేసి మెట్రోను డెవలప్ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.  కేంద్రానికి మెట్రో విస్తరణపై  సీఎం అనేక అంశాలను ఉంచారు. మెట్రోతో పాటు హైద్రాబాద్ అభివృద్ధి ప్రపోజల్స్‌ను కేంద్రానికి పంపించినట్లు చెప్పారు.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)