Breaking News

18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

Published on Thu, 08/17/2023 - 01:57

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టంనుంచి సగటున 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈనెల 20 నుంచి వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఈ నెలలో ఇప్పటివరకు అంతంతే.. 
ఆగస్టు నెలలో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన మేర కురవలేదు. గత నెలలో సాధారణం కంటే అత్యధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 47.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 58.37 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం కంటే 23 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ.. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 63%అధికం నుంచి ప్రస్తుతం 23% అధికం వద్ద గణాంకాలు స్థిరపడ్డాయి.

ఈ నెల మూడో వారం నుంచి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని, ఆగస్టు చివరి వారంలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనాలను విడుదల చేసింది. 18న ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు జోరందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)