Breaking News

ఆశ పెట్టి.. నిరుద్యోగితో ఆడుకున్నారు

Published on Fri, 10/11/2024 - 05:42

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ యువకుడికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కారంగుల సాయిరెడ్డి డీఎస్సీలో మంచి మార్కులు సాధించారు. ఈ నెల 8న ఆయనకు డీఈవో కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీరు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు సోషల్‌ స్టడీస్‌లో సెలెక్ట్‌ అయ్యారు. 9న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోవాలి’అని ఫోన్‌ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ కూడా వచ్చింది. 9న ఉదయం కామారెడ్డికి చేరుకున్న సాయిరెడ్డి.. జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్‌ బయలు దేరారు.

బస్సుకు అతికించిన జాబితాలో కూడా సాయిరెడ్డి పేరుంది. హైదరాబాద్‌కు వెళ్లిన సాయిరెడ్డికి అక్కడ సీఎం ప్రోగ్రాం ముగిసిన తరువాత నియామక పత్రాలు ఇచ్చేటపుడు జాబితాలో పేరు లేదన్నారు. దీంతో గురువారం డీఈవో రాజును కలవగా, పొరపాటు జరిగిందని, మీరు సెలెక్ట్‌ కాలేదని సమాధానం ఇచ్చారు. ‘మీకన్నా ముందు ర్యాంకు వాళ్లకు వెళ్లాల్సిన మెసేజ్, ఫోన్‌ కాల్‌ మీకు వచ్చింది, సారీ’అంటూ చెప్పారు. దీంతో సాయిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తొలుత జాబితాలో పేరు ఉన్నట్టుగా చూపి, చివరకు ఇలా లేదని చెప్పడంలో ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)