Breaking News

GHMC: 27 మున్సిపాలిటీల విలీనానికి ‘డ్రాఫ్ట్‌’

Published on Wed, 12/03/2025 - 19:33

సాక్షి, సిటీబ్యూరో: శివారు మున్సిపాలిటీలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లో విలీనమయ్యాయి.. అధికారులు డ్రాఫ్ట్‌ తయారీలో లీనమయ్యారు.. ఈ మేరకు వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమవుతోంది. జీహెచ్‌ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ వెలువడిన అనంతరం మూడు రోజుల్లోగా డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తు సాగుతోంది.. వార్డుల పునర్విభజనపై ప్రజల అభ్యంతరాలను పరిష్కరించిన అనంతరం అధికారులు తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

విలీనమవుతున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్న ప్రాంతాన్ని ఇప్పటికే తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(టీ క్యూర్‌)గా (Telangana core urban region) పిలుస్తున్నారు. అయితే దానికి చట్టబద్ధత కల్పించేందుకూ కసరత్తు చేస్తున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని ఇకపై టీక్యూర్‌గానే  (TCUR)వ్యవహరించనున్నారు. ఈ పరిధిలో జనాభా దాదాపు 1.30 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

విలీనమైన మున్సిపాలిటీలు సహా జీహెచ్‌ఎంసీలోని అన్ని వార్డుల్ని డీలిమిటేషన్‌ చేసే పేపర్‌ వర్క్‌ దాదాపుగా పూర్తయింది. విలీనం, వార్డుల పునర్విభజనకు సంబంధించి చట్టపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విలీనమయ్యాక సైతం పరిపాలన వ్యవస్థ వార్డులు, సర్కిళ్లు, జోన్లుగానే ఉంటుంది.  

ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ వరకే బడ్జెట్‌ 
ప్రతియేటా రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాదాపు నాలుగైదు నెలల ముందుగానే జీహెచ్‌ఎంసీ (GHMC) బడ్జెట్‌ను రూపొందించడం ఆనవాయితీ. ప్రస్తుతం కొత్తగా 27 స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతున్నందున వాటిల్లోనూ పనులు చేయాల్సింది జీహెచ్‌ఎంసీయే. కొత్త బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిస్తారు.

జీహెచ్‌ఎంసీ పాలకమండలిని ఎన్నుకున్నది జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 వార్డుల వరకే. ఇప్పుడు కొత్తగా కలిసే స్థానిక సంస్థలకు నిధులు కేటాయించే అధికారం పాలకమండలికి సాంకేతికంగా లేదు. ఈనేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరకే కొత్త బడ్జెట్‌కు అధికారులు రూపకల్పన చేశారు.  

విలీనమైనవాటికి మరో రకంగా.. 
కొత్తగా విలీనమయ్యే వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి పొందడమో, మరో రకంగానో చట్టబద్ధమైన ఇబ్బందుల్లేకుండా కేటాయింపులు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో ముగిసిపోతుంది. ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: అస‌లే నిశిరాత్రులు.. ఆపై పొగ‌మంచు

కొత్త బడ్జెట్‌కు సంబంధించిన కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావడం తెలిసిందే. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కానందున, ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం 27 స్థానిక సంస్థలు కలిసినా జీహెచ్‌ఎంసీ ఒకటిగానే ఉంటుంది. జీహెచ్‌ఎంసీని విభజించాలనుకుంటే కొంతకాలం తర్వాతే ఆ పని జరగనుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)